Khila warangal | మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్ సత్య శారద
డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌తో పాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ) ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఖిలావరంగల్, ఫిబ్రవరి 04 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లా కార్యాలయాల ప్రాంగణంలోని డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌తో పాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ) ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. మీడియా సెంటర్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించి, ఎంసీఎంసీ సెల్ విధుల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ఎన్నికల ప్రచార ప్రకటనలకు సమయానుకూలంగా అనుమతులు మంజూరు చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రసారమయ్యే పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించే పోస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో మీడియా పాత్ర కీలకమని పేర్కొన్న కలెక్టర్, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు మీడియా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీపీఆర్వో ఆయుబ్ అలీ, ఆర్డీవో సుమా, డీపీవో కల్పన, అదనపు పీఆర్వో ప్రేమలత తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

