పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ సత్య శారద
గృహ విద్యుత్ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు.
ఖిలావరంగల్, మార్చి 25 : గృహ విద్యుత్ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGREDCO) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గృహాల రూఫ్‌టాప్‌లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ఆకర్షణీయమైన సబ్సిడీలు అందిస్తున్నట్లు చెప్పారు. ఒక కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్‌కు రూ. 30 వేల వరకు, రెండు కిలోవాట్లకు రూ. 60 వేల వరకు, మూడు కిలోవాట్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి రూ. 78 వేల వరకు రాయితీ లభిస్తుందని వివరించారు. ఈ పథకం ద్వారా గృహ అవసరాలకు కావలసిన విద్యుత్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, మిగిలిన విద్యుత్‌ను పవర్ గ్రిడ్‌కు అందజేసి అదనపు ఆదాయం పొందే అవకాశమూ ఉందన్నారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచార వాహనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళా సంఘాల ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈవో రాంరెడ్డి, టిజిరెడ్ కో జిల్లా మేనేజర్ రాజేందర్, ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

