నెగెటివిటీని తరిమేయండి
ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహం ఉంటుందని చెబుతాయి వాస్తు, జ్యోతిష శాస్ర్తాలు. ఆ శక్తి సానుకూలంగా ఉంటే ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ఆనందం పెరుగుతాయి. అదే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగితే అది కుటుంబసభ్యుల మానసిక స్థితి, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది.
ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహం ఉంటుందని చెబుతాయి వాస్తు, జ్యోతిష శాస్ర్తాలు. ఆ శక్తి సానుకూలంగా ఉంటే ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ఆనందం పెరుగుతాయి. అదే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగితే అది కుటుంబసభ్యుల మానసిక స్థితి, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. ఇంట్లో చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరగడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత తగ్గిపోవడం నెగెటివ్ ఎనర్జీ సూచనగా పండితులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో కూడా ఆకస్మికంగా ఆందోళన పెరిగితే, వాతావరణంలో శక్తి అసమతుల్యత ఉందని భావించవచ్చు.
ఇది ఎకువకాలం కొనసాగితే మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. దీంతోపాటు ఇంట్లో ఉన్నంతసేపు అలసిపోయినట్లు అనిపించడం, బయటికి వెళ్లినప్పుడు కొంత రిలీఫ్‌గా ఫీలవుతుంటారు. ఇది కూడా ఒకవిధమైన నెగెటివ్ ఎనర్జీకి సూచనే. అలాగే రాత్రిపూట నిద్ర సరిగా రాకపోవడం, చెడు కలలు రావడం కూడా ఈ ప్రభావంలో భాగమే. తగిన ఆదాయం ఉన్నప్పటికీ ఇంట్లో డబ్బు నిల్వకపోవడం, తరచుగా ఏదో ఒక రూపంలో ఖర్చులు రావడం వంటివి వాస్తు శాస్త్రంలో అసమతుల్య శక్తి సూచనగా చెబుతారు. ఇది నేరుగా నెగెటివ్ ఎనర్జీ కాకపోయినా, ఇంటి వాతావరణం అస్థిరంగా ఉంటే నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
ఇంట్లో గానీ పనిచేసే ప్రదేశాల్లో గానీ ఎలక్ట్రానిక్ వస్తువులు, గడియారాలు, లైట్లు తరచుగా పాడవడం లేదా వస్తువులు పడిపోవడం వంటి సంఘటనలు ఎకువగా జరుగుతుంటే అది కూడా నెగిటివ్ ఎనర్జీకి సంకేతమే. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇంట్లోకి గాలి, వెలుతురు సమృద్ధిగా వచ్చేలా చూసుకోవాలి. ఉదయం సమయంలో సూర్యరశ్మి ఇంట్లోకి రావడం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక సాధనతోనూ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవచ్చు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

