ఇదేం కల్చర్!?
ఒక సంస్థలో పనిచేసే ఏ ఉద్యోగికి అయినా నిర్దిష్ట పనివేళలు ఉండటం కామన్. కానీ, చాలామంది యజమాని మెప్పు పొందడానికో, టార్గెట్ త్వరగా అందుకోవాలనో పనివేళలకు మించి డ్యూటీ చేస్తుంటారు.
ఒక సంస్థలో పనిచేసే ఏ ఉద్యోగికి అయినా నిర్దిష్ట పనివేళలు ఉండటం కామన్. కానీ, చాలామంది యజమాని మెప్పు పొందడానికో, టార్గెట్ త్వరగా అందుకోవాలనో పనివేళలకు మించి డ్యూటీ చేస్తుంటారు. ఇలా అతిగా పనిచేయడం వల్ల వారి ఆరోగ్యం, వ్యక్తిగత, కుటుంబ జీవితంపైనా ప్రభావం పడుతుంది. అందుకే రంగం ఏదైనా పనివేళలకు మించి చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇక మన దేశంలో వర్ కల్చర్‌పై చర్చలు జరగడం కొత్తేమీ కాదు. కార్యాలయ వాతావరణం, ఉద్యోగులతో ఉన్నతాధికారులు వ్యవహరించే తీరుపై సోషల్ మీడియాలో చర్చలు, ప్రశ్నలు విపరీతంగా వైరల్ అవుతూనే ఉంటాయి.
పనితీరుపై బహిరంగంగా తోటి ఉద్యోగుల ముందు అవమానించడం, మందలించడం లాంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ పని సంస్కృతిపై మళ్లీ చర్చకు దారితీసింది. ఓ బ్యాంకు బ్రాంచ్‌లో పనివేళలు ముగిసినా ఉద్యోగులు పని పూర్తయ్యే వరకు బయటికి వెళ్లకుండా ప్రధాన గేటుకు తాళం వేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియో చూసిన నెటిజన్లు దిగ్భ్రాంతికి గురయ్యారు.
సదరు బ్యాంక్ మేనేజర్ తీరుపై మండిపడుతున్నారు. ఇది ఉద్యోగి హకుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు. ఎంప్లాయీస్‌ని వారి ఇష్టానికి వ్యతిరేకంగా కార్యాలయంలో ఉంచడం సరికాదని, బలవంతంగా ఓవర్ టైమ్ పనిచేయించడం ఆమోదయోగ్యం కాదని కామెంట్ చేస్తున్నారు. దీనిని విషపూరితమైన సంస్కృతికి ఉదాహరణగా పేరొంటున్నారు. మేనేజర్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో వర్ కల్చర్ మరోసారి చర్చల్లో నిలిచినట్టయింది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

