హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శనివారం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)-2026 బిల్లుతోపాటు, తెలంగాణ ప్రజావిశ్వాసం-2026 సవరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టారు.
చర్చ అనంతరం సభ ఈ రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సభలో మొత్తం 4 బిల్లులను ఆమోదించినట్టయింది. అనంతరం మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. గత 6 రోజుల్లో మొత్తం 19 గంటల 20 నిమిషాలపాటు శాసనమండలి జరిగినట్టు ఆయన వెల్లడించారు.