అనుకున్న సమయానికే ఇరుముడి
రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ విడుదల తేదీ విషయంలో ఎలాంటి అయోమయం లేదని, ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నదని మంగళవారం మేకర్స్ ప్రకటించారు.
రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ విడుదల తేదీ విషయంలో ఎలాంటి అయోమయం లేదని, ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నదని మంగళవారం మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ని విడుదల చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఆధ్యాత్మిక అంశాల కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్గ్లింప్స్తో పాటు ‘ఇరుముడి కట్టు’ అనే అయ్యప్పభక్తి పాటకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని చిత్రబృందం వెల్లడించింది. త్వరలో ఈ సినిమాలోని రెండోపాటను రిలీజ్ చేస్తామని చిత్ర దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. ప్రియాభవానీశంకర్, సాయికుమార్, బేబీ నక్షత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

