బిజినేపల్లి విద్యుత్తు శాఖలో కుంభకోణం.. క్రొత్త కనెక్షన్ల మంజూరులో అవకతవకలు
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని విద్యుత్ శాఖలో వినియోగదారులకు అవసరం లేకు న్నా కేవలం సింగిల్ ఫేజ్ మీటర్‌కు రూ.వే లు కట్టించి రూ.లక్షల్లో ప్రభుత్వ సొమ్మును అధికారులు, కాంట్రాక్టర్ దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
- రూ.50 లక్షలు పక్కదారి పట్టినట్టు ఆరోపణలు
బిజినేపల్లి, జూలై 28 : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని విద్యుత్ శాఖలో వినియోగదారులకు అవసరం లేకు న్నా కేవలం సింగిల్ ఫేజ్ మీటర్‌కు రూ.వే లు కట్టించి రూ.లక్షల్లో ప్రభుత్వ సొమ్మును అధికారులు, కాంట్రాక్టర్ దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఇండ్లు, రైతుల విద్యుత్తు కనెక్షన్ల కోసం సామగ్రి అవసరం లేకున్నా డీడీలు కట్టించి రూ.4 లక్షల వరకు ఎస్టిమేషన్ వేసినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో మీటర్లు, స్తంభాలు పాతకుండా పని పూర్తయినట్లు చూపించడంపై మండల ప్రజలు అవాక్కయ్యారు.
కొన్ని దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్లో ఎస్టిమేషన్లో పని పూర్తయి వర్క్ ఆర్డర్, మీటర్ రిలీజ్ వివరాలు చూపిస్తున్నా సంబంధిత ప్రాంతా ల్లో ఏ ఒక్క పనీ చేపట్టనట్టు చూపిస్తున్నది. మండలంలోని ఖానాపూర్, పాలెం, మంగనూర్, బిజినేపల్లి గ్రామాల్లో ఇండ్లకోసం సింగిల్‌ఫేజ్ మోటర్లకు డీడీలు చెల్లించి రూ.లక్షల్లో ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నట్టు తెలిసింది. లైన్మెన్ స్థాయి నుంచి ఏఈ, కాంట్రాక్టర్వరకు తె లిసే రూ.50 లక్షలకుపైగానే పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

