Bachannapeta | అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి : సీఐ అబ్బయ్య
ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని సీఐ అబ్బయ్య అన్నారు.
బచ్చన్నపేట ఏప్రిల్ 14 : ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని సీఐ అబ్బయ్య అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షుడు కంత్రి సత్తయ్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా నర్మెట్ట సీఐ అబ్బయ్య పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో సమానత్వం కోసం ఆయన పడిన తపన అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎలిమెంటు ధరించి వాహనం నడపాలని రోడ్డు భద్రత సూచనలు పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు మల్యాల బాల నరసయ్య, పైసా రాజశేఖర్ అల్వాలరాజు, అల్వాల రమేష్, గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు, ఉప సర్పంచ్ బైరి రజిత వెంకటయ్య పాల్గొన్నారు.
అదేవిధంగా కట్కూరులో జంబు యూత్ అధ్యక్షులు మధు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఒక పండుగలా నిర్వహించారు. సర్పంచ్ బల్ల రవీంద్రనాథ్ తో కలిసి ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూల్మిట్ట పర్షయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

