జనగామ రూరల్, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ 26వ ఆవిర్భవ దినోత్సవం సోమవారం గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించారు. జనగామ మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశంతో పార్టీ గద్దెల వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ 26 ఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అండగా నిలిచి ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
తెలంగాణలో అమలు చేసిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేదన్నారు. తెలంగాణకు అనేక సందర్భాల్లో పలు అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఎప్పటికైనా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వ మేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచ్ లో, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.