Khila Warangal | వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి కలెక్టర్‌కు ఫిర్యాదు
వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీపడిన గుండె స్వప్నిక వర్ధన్నపేట మున్సిపాలిటీ కమిషనర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఖిలావరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీపడిన గుండె స్వప్నిక వర్ధన్నపేట మున్సిపాలిటీ కమిషనర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగి వాణి తిరుపెల్లి (కాంగ్రెస్ అభ్యర్థి) 13 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించారని, నిజానికి తాను ఎక్కువ ఓట్లు పొందానని ఆమె పేర్కొన్నారు. స్వప్నిక తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 30 రోజుల్లో ఎలక్షన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది.
ఈ క్రమంలో ఫలితాలు, లెక్కింపు పత్రాల కోసం 19 ఫిబ్రవరి 2026న మున్సిపాలిటీ కమిషనర్‌కు ఆర్టీఐ దరఖాస్తు చేసినా, అది ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో తన హక్కు కోల్పోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బలవంతంగా సమాచారం దాచాలనే ఉద్దేశంతోనే కమిషనర్ ఆలస్యం చేస్తున్నారని ఎన్నిసార్లు అడిగినా సమాధానం రావడం లేదని ఆరోపించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు ఎన్నికల్లో మొదట బీఆర్ఎస్ అభ్యర్థి 7 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించగా, రీకౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి వాణీ 13 ఓట్ల మెజారిటీతో విజేతగా ప్రకటించారు. లెక్కింపు సిబ్బంది, రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) అక్రమాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

