ఖిలావరంగల్: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి రెండో శనివారం ప్రభుత్వం సెలువు దినంగా ప్రకటించాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ అన్నారు. సోమవారం ఏబీఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సేర్వోస్ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శాదరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు.
విద్యార్థులకు రెండో శనివారం కూడా తరగతులు నిర్వహించడం వలన మానసిక ఒత్తిడికి గురవుతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి ప్రతి రెండో శనివారం జిల్లాలోని ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో సెలవు దినంగా ప్రకటించి విద్యార్థులకు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా విద్య అభ్యసించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శనిగరపు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.