పాటలు వింటూ పరుగు!
ఆరోగ్యం కోసం నిత్యం వాకింగ్, జాగింగ్ చేస్తుంటారు. వారిలో కొందరు పాటలు వింటూ.. వ్యాయామంలో మునిగిపోతుంటారు. ఇలా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సంగీతం వినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో వ్యాయామంతోపాటు సంగీతం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
ఆరోగ్యం కోసం నిత్యం వాకింగ్, జాగింగ్ చేస్తుంటారు. వారిలో కొందరు పాటలు వింటూ.. వ్యాయామంలో మునిగిపోతుంటారు. ఇలా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సంగీతం వినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో వ్యాయామంతోపాటు సంగీతం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి రెండూ కలిస్తే.. ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. కార్టిసాల్ స్థాయులు తగ్గి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. పాటలు వినడం వల్ల.. శారీరక అలసట నుంచి మెదడు దృష్టి మళ్లుతుంది. దీనివల్ల కండరాల నొప్పి తక్కువగా అనిపిస్తుంది. ఫలితంగా, మరింత ఎక్కువ సమయం, ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేసే అవకాశం ఉంటుంది. హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడం వల్ల.. బయటి శబ్దాలు మీ దృష్టికి రాకుండా ఉంటాయి.
దాంతో, మీ ఫోకస్ అంతా వ్యాయామంపైనే కేంద్రీకృతం అవుతుంది. పాటల్లోని బీట్స్ కూడా మీ కదలికలను నియంత్రిస్తుంటాయి. ఫాస్ట్‌బీట్ పాటలు వింటుంటే.. మీకు తెలియకుండానే మీ అడుగుల వేగం పెరుగుతుంది. ఉత్తేజపరిచే పాటలు వింటున్నప్పుడు శరీరంలో సహజంగానే డోపమైన్, సెరోటోనిన్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి బద్ధకాన్ని వదిలిస్తాయి. వ్యాయామంపై ఆసక్తిని పెంచుతాయి. ఒంటరిగా, రాత్రి వేళల్లో వాకింగ్ చేసేటప్పుడు సంగీతం వినడం వల్ల.. భద్రతా భావం కలుగుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

