కమలాపూర్ : కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలోని విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో అనుమతి లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారు. స్కూల్లోని ఓ గదిలో అక్రమంగా పుస్తకాల విక్రయం జరుగుతోంది. దాంతో ఆ పాఠశాల గదిని మండల విద్యాధికారి శ్రీధర్ శనివారం సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యం అనుమతి లేకుండా పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తున్నారని అన్నారు. ఆ పుస్తకాలు కొనుగోలు చేసే విద్యార్థుల నుంచి అధిక ధర వసూలు చేస్తున్నారని చెప్పారు. అనుమతి లేకుండా అక్రమంగా పుస్తకాలు విక్రయిస్తుండటంతో ఆ పుస్తకాలను నిలువ ఉంచిన గదిని సీజ్ చేసినట్లు తెలిపారు.