హనుమకొండ, జూన్ 15 : ఏకశిలా పార్క్ వాకర్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు తలసేమియా వ్యాధి గ్రస్తుల పిల్లలకు సహాయార్థం నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో 30 మంది వాకర్లు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసారు. వాకర్స్అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రాజిరెడ్డి మాట్లాడుతూ తలసేమియా వ్యాధి గ్రస్తులకి తీవ్ర రక్త కొరత ఉన్నందున వాకర్స్అందరూ స్వచ్ఛందంగా రక్త దానం చేయాలని కోరారు. అసోసియేన్ ఆధ్వర్యంలో ఏకశిలా పార్కులో ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రక్తదానం చేయడంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ గవర్నర్ కూరాకుల భారతి, పూర్వ గవర్నర్ ఎల్లా గౌడ్, గౌరవ అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి, సెక్రటరీ సోమయ్య, రెడ్ క్రాస్ సొసైటీ ఈసీ మెంబర్ పుల్లూరి వేణుగోపాల్, వాకర్స్ ప్రతినిధులు బోద్దిరెడ్డి రాజిరెడ్డి, వీరస్వామి, కుమారస్వామి, యాదగిరి, రమణ రెడ్డి, తిరుపతి, సుధీర్, రెడ్‌క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.