భీమదేవరపల్లి : పట్టపద్రుల ఎమ్మెల్సీగా(Mlc elections) అంజిరెడ్డి గెలుపొందడం పట్ల హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్ మాట్లాడుతూ నరేందర్ రెడ్డి ఓటమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు.
టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కొమురయ్య, పట్టభద్రులు ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని గెలిపించడం పట్ల ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముల్కనూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దొంగల కొమురయ్య, పైడిపల్లి పృథ్వీరాజ్, గండు సారయ్య, మాచర్ల కుమారస్వామి, ఊసకోయిల కిషన్, అంబీరు కవిత, దొంగల వేణు, బొజ్జపురి పృథ్వీరాజ్, దొంగల రాణా ప్రతాప్, కంకల సదానందం తదితరులు పాల్గొన్నారు.