ఖిలావరంగల్: శివనగర్ లోని పలు ప్రాంతాల్లో భక్త మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ 34, 35 డివిజన్ల పద్మశాలి కమిటీల ఆధ్వర్యంలో భక్త మార్కండేయ జయంతి వేడుకలు పద్మశాలి కమ్యూనిటీ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి జిల్లా కమిటీ ఈసీ మెంబర్ మేరుగు అశోక్ హాజరై మార్కండేయ చితపటానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్త మార్కండేయ స్ఫూర్తితో పద్మశాలీలు ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. అన్ని రంగాల్లో ముందుండి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.
అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అరటి పండ్లను పంపిణీ చేసి సేవాభావాన్ని చాటారు.
ఈ కార్యక్రమంలో 35 డివిజన్ అధ్యక్షులు గడ్డం రవి, 34 డివిజన్ అధ్యక్షులు కోడం ప్రతాప్, పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులు వాలుస రాజమల్లు, కుడికాల శారద, 34, 35 డివిజన్ల కార్యదర్శులు వెంగళదాసు కృష్ణ, సింగం శ్రీనివాస్, శివనగర్ సీనియర్ నాయకులు సింగం కుమార్ పాల్గొన్నారు. అలాగే రెండు డివిజన్ల కార్యవర్గ సభ్యులు కుడికాల మనోహర్, వడ్డేపల్లి సతీష్, వడ్డేపల్లి రఘు, మాచన శ్రీధర్, సింగం నీరజ్, భోగ కుమారస్వామి, కందగట్ల రాజేష్, చిదురాల సాయిరాం, సూరజ్, గడ్డం సాయి దీక్షిత్, కస్తూరి రాహుల్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పోపా కార్యాలయంలో..
శివనగర్ లోని పోపా కార్యాలయంలో భక్త మార్కండేయ జయంతి వేడుకలను పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోపా జిల్లా అధ్యక్షులు గుండు కామేశ్వర్, పోపా ప్రతినిధులు గోషికొండ సుధాకర్, ధర్మపురి రాజగోవిందు, పెద్దురి పెద్దన్న, మాటేటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.