హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 23: ఈ నెల 26న జరిగే జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) బీసీలను గెలిపించుకుందామని బీసీ సంఘం నాయకులు కోరారు. ఆదివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం మొత్తం 26 వేల ఓట్లలో 24 వేల ఓట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారన్నారు. కేవలం 2000 ఓట్లు మాత్రమే రెడ్డి, రావులు ఉన్నారన్నారు.
విద్యాసంస్థల చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, రిటైర్డ్ డీఈవో చంద్రమోహన్, వెంకటస్వామి, పూల రవీందర్‌ను మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, మేరు సంఘం ఉపాధ్యక్షుడు తాళ్ల సంపత్, ఇతర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.