హనుమకొండ, సెప్టెంబర్ 24: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’లో భాగంగా అమెరికా, లండర్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్సౌత్ కొరియా దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునేవారికి ఈ పథకం కింద రూ.20 లక్షలు స్కాలర్షిప్ కోసం నవంబర్ 19లోగా దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా షెడ్యూల్డ్ కులాలాభివృద్ధి శాఖ ఉపసంచాలకులు బి.నిర్మల తెలిపారు.
వీసా, ఫీ, ఒకవైపు విమాన ప్రయాణ ఛార్జీలు ఇవ్వబడుతుందని, విద్యార్థులు జీఆర్ఈ, జీమ్యాట్ లేదా టోఫెల్, ఐలెట్స్లలో అర్హత, స్కోర్‌తో పాటు, డిగ్రీ, పీజీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలని, విద్యార్థి కుటుంబం సంవత్సరానికి ఆదాయం అన్నివిధాల రూ.5 లక్షలకు మించరాదన్నారు. కులం, ఆదాయం, నివాసం మీ-సేవా నుంచి పొందాలని, ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే స్కాలర్షిప్ ఇవ్వబడుతుందన్నారు. అభ్యర్థి విద్యనభ్యసించడానికి పాస్‌పోర్ట్, వీసా కలిగి ఉండాలని, అక్రిడేటేషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ, సంస్థ నుంచి అడ్మిషన్ లెటర్ పొంది ఉండాలన్నారు. ఈ పథకానికి ఆన్లైన్ www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో నిర్ణీత ప్రోఫార్మలో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రందించాలని నిర్మల సూచించారు.