హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 6: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 8వ తేదీన హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో అండర్-19 మెన్ అండ్ వుమెన్ బాక్సింగ్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేస్తామని హనుమకొండ, వరంగల్ డిస్ట్రిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతరాజు రాజేందర్ తెలిపారు. జనవరి 1, 2007 నుంచి డిసెంబర్ 31, 2008 బర్త్ సర్టిఫికెట్ ఉన్న క్రీడాకారులు అర్హులని పేర్కొన్నారు.
పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, బోనోఫైడ్ సర్టిఫికెట్, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, రూ.300 ఎంట్రీ ఫీజుతో పాటు జిరాక్స్ కాపీల కుడా తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఇందులో ఎంపికైన బాక్సర్లకు ఈనెల 11, 12వ తేదీల్లో సికింద్రాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారని, ఇతర వివరాలకు 9959711609 పోతరాజు రాజేందర్ సెల్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు.