హనుమకొండ చౌరస్తా, జనవరి 7: ఈనెల18న ఆదిలాబాద్‌లో జరిగే అథ్లెటిక్స్ 11వ రాష్ర్టస్థాయి సబ్ జూనియర్ ఛాంపియన్ షిప్‌కు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ అధ్యక్షుడు పుల్యాల కిషన్, కార్యదర్శి ఊర యుగంధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం హనుమకొండ హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ ఎస్)లో వరంగల్ జిల్లాస్థాయి సబ్‌జూనియర్, 20 ఇయర్స్ ఛాంపియన్షిప్ పోటీలు అండర్-8, 10, 12, 14, 20 సంవత్సరాల బాలబాలికలకు అథ్లెటిక్స్పోటీలను రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి పాల్గొని ప్రారంభించారు.
ఇందులో సుమారు 200 మంది అథ్లెట్లు పాల్గొని ప్రతిభ కనబర్చారని, వారికి మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 30 మందిని రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్‌లో పాల్గొంటారని వారు తెలిపారు.