హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 2: హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ, బీకాం, బీఎస్సీ నాలుగవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమైనవి. పరీక్షల నిర్వహణ విధానాన్ని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సుధీర్, అధ్యాపకుడు డాక్టర్ సాయి చరణ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని, పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు.