హనుమకొండ చౌరస్తా, మార్చి 31: హనుమకొండ 5వ డివిజన్లోని కొత్తూరు జెండా శ్రీభక్తాంజనేయ దేవాలయ ఆర్చిని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్ నలబోల సతీష్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, వీరగంటి రవీందర్, చీకటి ఆనంద్, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి, మహిళా నాయకురాలు కరుణశ్రీ, రాణి, అనిత, కార్యకర్తలు పాల్గొన్నారు.