మహాదేవపూర్,(కాళేశ్వరం) జూన్ 12 : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం – టఫ్ మహాదేవపూర్ మండల అధ్యక్షులు సట్ల సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయూబోద్దీన్ సమన్వయంతో స్థానిక జామా మజీద్లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామని మాట ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ సర్వ మత ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించామని రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయూబోద్దీన్ అన్నారు.
ఉద్యమకారులను గురించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, రెండు గుంటల ఇంటి స్థలంతో పాటు, సమరయోధుల పింఛన్ కల్పించి ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. ఉపాధి,ఉద్యోగ అవకాశాల్లోనూ ఉద్యమకారులకు కోటా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి ఎండీ అక్రమోద్దీన్, ఇర్షాద్, గయాస్, బషీర్ ఖాన్, రఫీ, వామన్ రావు తదితరులు పాల్గొన్నారు.