హనుమకొండ, డిసెంబర్ 23: దేశ పునర్నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేసేందుకు ఏబీవీపీ ప్రయత్నం చేస్తుందని ఏబీవీపీ జాతీయ సహా సంఘటన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశంలో లడక్ నుంచి కడక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్న మతాలు, జాతులు, కులాలు, ప్రాంతాలు ఉన్నప్పటికి మనమంతా భారతీయులమనే ఒక సూత్రంపైనే మన జీవన విధానం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మాసాడి బాబురావు, డాక్టర్ జానారెడ్డి, రాష్ర్ట కార్యదర్శి మాచర్ల రాంబాబు, స్టేట్ యూనివర్సిటీస్ హాస్టల్స్ కన్వీనర్ జీవన్, కేయూ ఎబివిపి ఇంచార్జి డాక్టర్ నిమ్మల రాజేష్, అధ్యక్షుడు ఉబ్బటి హరికృష్ణ, కార్యదర్శి జ్ఞానేశ్వర్, ఆగపాటి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.