హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 23: ఇండియా-పాక్ మ్యాచ్ (India-Pak Cricket )అంటేనే కీలకమైన పోరు. రెండు జట్ల మధ్య జరిగే పోటీ అంటే ఎన్ని పనులున్నా వదులుకొని ఇరు జట్ల ఆటను వీక్షించేందుకు అభిమానులు ప్రయత్నిస్తుంటారు. కాగా, ఆదివారం ఇటు పెళ్లిళ్ల సీజన్ అటు క్రికెట్ మ్యాచ్ ఉండటంతో పెళ్లికి వచ్చినవారు వీక్షించేందుకు భారీ స్క్రీన్‌పై ఇండియా-పాక్ మ్యాచ్ వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ సంఘటన నగరంలో ఓ పెళ్లిలో చోటు చేసుకుంది. మ్యాచ్‌ని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కాకూడదన్న క్రికెట్ అభిమానుల కోసం పెళ్లి వేడుకల్లో ఇలా మ్యాచు తిలకించేందుకు ఏర్పాట్లు చేయగా నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం లైవ్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ఆదివారం కలిసిరావడంతో కుటుంబ సమేతంగ పెళ్లి వేడుకల్లో పాల్గొని క్రికెట్ మ్యాచ్ వీక్షించారు.