హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 16: గ్రేటర్ వరంగల్లోని నాలుగో డివిజన్ అధ్యక్షుడు కంచర్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ డివిజన్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో కూడిన లోగోను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈనెల 27న ఎలుకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవానికి నేను సైతం అంటూ విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, రైతులు, ప్రజలందరూ ఉత్సాహంగా వస్తామంటున్నారని తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గంలో ఏ పనులు ప్రారంభించిన నాలుగో డివిజన్ నుంచి ప్రారంభించేదని, రజతోత్సవ ప్రచారం కూడా ఇక్కడి నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యమ సమయంలో కూడా ప్రజలందరికి శాసనసభ్యుడిగా, చీఫ్ వి విప్ గా, అధ్యక్షుడిగా అందరితో కలిసి వుండి అన్ని విధాల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతగా ప్రజల అండగా ఉంటానని, దగాపడ్డ తెలంగాణ ప్రజలను కాపాడుకుంటానన్నారు.
అంతకుముందుకు పెద్దమ్మ గడ్డ జంక్షన్ లో పార్టీ జెండాను వినయ్ భాస్కర్ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, బాజీ డివిజన్ అధ్యక్షుడు పేర్ల మనోహర్, డివిజన్ యూత్ అధ్యక్షుడు హనుమకొండ బద్రి, దరిగి నిరంజన్, బొక్క అశోక్ పాల్గొన్నారు. అనంతరం పెద్దమ్మ గడ్డ ఆటో యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.