డోర్నకల్, ఆగష్టు 18 : మహబూబాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పలుచోట్ల చెరువులు, రోడ్లు తెగిపోయి రైతులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలకు తాజాగా డోర్నకల్ మండలంలోని వెన్నారం పెద్ద చెరువు కట్టకు గండి పడింది. దీంతో కట్ట గండిని ఇరిగేషన్ ఏఈలు కిషన్, హార్దిక పరిశీలించి జెసిబి సాయంతో మరమ్మతులు చేయించారు.
గండి నుంచి వరద పొతే ఖమ్మం జిల్లా మంగళగూడెం గ్రామం మునిగిపోయే ప్రమాదం ఉంది. వెన్నారం, మంగళగూడెం రైతుల పంట పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. రైతులకు తీవ్ర పంట నష్టం కలిగే అవకాశముంది. కాగా, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.