కూరగాయలు కుతకుత ఉడుకుతున్నయ్. వాటి ధరలు రెక్కలొచ్చాయ్.. ఏవి కొందామన్నా కిలో రూ.50 నుంచి రూ.100 కు చేరి సామాన్యుల్లో గుబులు రేపుతున్నయ్. రూ.500 పెట్టినా కనీసం చేతి సంచి కూడా నిండని పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని గ్రామాల నుంచి కాయగూరలు రావడం లేదని, అందుకే ధరలు పెరిగాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.
– మహబూబాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ)
కూరగాయల ధరలు భగ్గుమంటున్నా యి. మొంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురిశాయి. ఇవి కూరగాయల చేన్లపై తీవ్ర ప్రభావాన్ని చూ పడంతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నా యి. గ్రామాల నుంచి సరఫరా తగ్గిపోవడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో గతంలో కంటే కూరగాయల సాగు బాగా తగ్గింది. కోతుల బెడద, పెట్టుబడి తదితర కారణాలతో వాటిని పండించడం లేదు. చేసినా అరకొర సాగుతో కొద్దిపాటిగా వస్తున్నాయి. ఉన్నట్టుండి కూరగాయల ధరలు కిలోకు ఏకంగా రూ. 100కు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హోల్‌సేల్‌గా కిలో రూ.80 చొప్పున ఉంటే రిటైల్ మారెట్లో రూ. 100కు పైగా పలుకుతున్నది.
బీరకాయ, దొండకాయ, బుడంకాయలు, వంకాయ కిలోకు రూ.80, బెండకాయ, కాకర, చిక్కుడు కాయ రూ.100, మంచి చికుడు కిలో రూ.120లకు చేరింది. సొరకాయ ఒకటి రూ.70, క్యాబేజీ రూ.80, పచ్చిమిర్చి కిలో రూ.50కి చేరింది. ఆలుగడ్డ కిలో రూ.50కి చేరింది. మార్కెట్‌కు తగినన్ని కూరగాయలు రాకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వ్యాపారులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ధరలు పెరిగాయని చెబుతున్నారు.
విజయవాడ, మానుకోట, ఖమ్మంలో కురిసిన భారీ వర్షాలతో కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాలతో పాటు జిల్లాలపై ఆధార పడాల్సి వస్తున్నది. కూరగాయల ధరలు దాదాపుగా సగానికంటే ఎకువ కిలోకు రూ.100 దాటడంతో ప్రజలు కొనాలంటే జంకుతున్నారు. ఒకవైపు మారెట్‌కు కూరగాయలు రావడం తగ్గడంతో పాటు ప్రస్తుతం కార్తీక మాసం కావడం, అయ్యప్ప భక్తులు మాలలు ధరిస్తుండడంతో డిమాండ్ పెరిగింది.
కూరగాయల ధరలు రోజురోజు కు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొనాలంటేనే భయం వేస్తుంది. టమాట మినహా మిగిలిన కూరగాయలన్నీ కిలోకు రూ.70 నుంచి 100 వర కు పలుకుతున్నవి. టమాట మాత్రం రూ.30కు దొరుకుతున్నది. గతంలో రూ. 100 పెడితే మూడు నాలుగు రకాలొచ్చేవి. ఇప్పుడు ఒక రకమే వస్తున్నది.
– మంద స్వాతి, మహబూబాబాద్