హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 14: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో 1637ను విడుదల చేశారు. గతంలో ఎన్పీడీసీఎల్ సీఎండీగా కార్తికేయ మిశ్ర ఐఏఎస్ ఆఫీసర్ పని చేశారు. ఆ తర్వాత సీఎండీగా అన్నమనేని గోపాల్‌రావు కొనసాగారు. ప్రస్తుతం గోపాల్‌రావు పదవీ కాలం పూర్తికావడంతో 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వరుణ్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.