హామీలు నెరవేర్చకుంటే ప్రజలే నిలదీస్తరు..
కేసీఆర్ కంటే గొప్పగా అదిచేస్తాం, ఇది ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. డిసెంబర్ 9న ఇస్తామన్న రైతుబంధు కూడా ఇవ్వలేదని.. హామీలు నెరవేర్చకపోతే ప్రజలే నిలదీస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
- కాంగ్రెస్ రైతుబంధు ఇవ్వకుండా నోట్లో అరటిపండు పెట్టింది.. ఆ పార్టీని నమ్మి మోసపోయామని బాధపడుతున్నరు
- మూడోసారి మోడీకి ఓట్లు ఎందుకు వేయాలి?
- అక్షింతల పేరుతో రాజకీయాలా? : మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
- హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం
- బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపై భౌతికదాడులు : మాజీ మంత్రి ఎర్రబెల్లి
- ప్రజల ళం, బలం, గళం ఎప్పటికీ బీఆర్ఎస్సే : మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
- వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం
కేసీఆర్ కంటే గొప్పగా అదిచేస్తాం, ఇది ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. డిసెంబర్ 9న ఇస్తామన్న రైతుబంధు కూడా ఇవ్వలేదని.. హామీలు నెరవేర్చకపోతే ప్రజలే నిలదీస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అలాగే మతాల పేరుతో రాజకీయాలు చేసే మోడీకి మూడోసారి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అధ్యక్షతన సోమవారం హంటర్‌రోడ్‌లోని సీఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథి నిరంజన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఇటు కేంద్రంలోని మోదీ, అటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన నేతలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు అవలంబించాల్సిన తీరు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.
– న్యూశాయంపేట, జనవరి 29
కేసీఆర్ కంటే గొప్పగా చేస్తాం, ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తున్నదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. అదునుకు రైతుబంధు ఇవ్వకుండా నోట్లో అరటిపండు పెట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని, ఇచ్చిన గ్యారెంటీలను వంద రోజుల్లో కాకపోతే ఐదు సంవత్సరాల్లోగా నెరవేర్చండి అని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఎన్నో రాజకీయ పరిణామాలు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉన్నా ఏమీ చేయలేదన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా పోటీ చేసి గెలిచామని, 2014, 2018లో ఉద్యమనేత కేసీఆర్‌ని ప్రజలు ఆదరించారని, అభివృద్ధే ఎజెండాగా ప్రభుత్వం ముందుకెళ్తున్న సమయంలో మరింత పట్టుదలగా శ్రమిస్తే ఫలితం మనదే ఉండేదని నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని, విజయంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. పార్లమెంట్ సీట్లు కచ్చితంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశంలో వరుసగా మూడుసార్లు ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదని, ఎన్టీఆర్ హయాంలో కూడా ప్రభుత్వం మారిందని గుర్తుచేశారు. ఉద్యోగాల భర్తీ జరగలేదని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని, దేశంలో ఎకడా లేనివిధంగా ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. ఓటమిపై సమీక్షించుకొని పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
విషప్రచారం వల్లే కాంగ్రెస్ గెలిచింది..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేస్తామని చెప్పి ఇంకా వేయలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోనే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపైన భౌతికదాడులు చేస్తున్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే అందరం ఒకటి కావాలి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విషప్రచారం చేసి గెలిచింది. చిన్నచిన్న కారణాలతో మనం ఓడిపోయాం. కార్యకర్తల సూచనలు పరిగణనలోకి తీసుకొని పార్టీని బలోపేతం చేద్దాం.
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
గెలిచినా, ఓడినా ప్రజలతోనే..
అధికారంలో ఉన్నా, లేకున్నా.. తెలంగాణ ప్రజల దళం, బలం, గళం ఎప్పటికీ బీఆర్ఎస్సే. ఇదే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దాం. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఓడిపోయినా నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిషారానికి, అభివృద్ధికి కృషిచేస్తా. పదేళ్లలోనే 50 ఏండ్ల అభివృద్ధిని కండ్లచూపిన ఘనత బీఆర్ఎస్ సరార్దే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్ జెండా ఎగరేద్దాం. జిల్లాలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్దాం. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయాలి. రైతుబంధు, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి కోసం ఆయా వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలి.
– అరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు
అనంతరం ఈ నెలతో పదవీ కాలం ముగియనున్న క్రమంలో నియోజకవర్గంలోని పలువురు సర్పంచులను అరూరి రమేశ్ సన్మానించారు. సమావేశంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, లలితా యాదవ్, జడ్పీ వైస్‌చైర్మన్ శ్రీరాము లు, కోఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ, సర్వర్, కార్పొరేటర్లు రాధికారెడ్డి, శిబా-అనిల్, అరుణ-విక్టర్, రజిత-శ్రీనివా స్, దివ్యరాణి-రాజునాయక్, సిరంగి సునీల్, జడ్పీటీసీలు భిక్షపతి, సునీత, ఎంపీపీలు మధుమతి, అప్పారావు, సునీత, కమల, మున్సిపల్ చైర్మన్ అరుణ, శంకర్‌రెడ్డి, కుమారస్వామి, కుమార్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్, రాజు, కుమార్‌యాదవ్, నరసింహ, స్పందన్, జైపాల్, వినోద్, శ్రీకాంత్, శ్రీధర్, మునీంద్రనాథ్, రవీందర్, పాక్స్ చైర్మన్లు హరికృష్ణ, రాజేశ్‌కన్నా, దేవేందర్, మనోజ్‌గౌడ్, గోపాల్‌రెడ్డి, రమేశ్, సంపత్‌రెడ్డి, శ్రీనివాస్, సమ్మయ్య, విజయ్, మార్కెట్ చైర్మన్ స్వామిరాయుడు, వైస్ ఎంపీపీలు రాజేశ్వరరావు, సోమలక్ష్మి-సోమయ్య, మోహన్, రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

