హనుమకొండ చౌరస్తా: కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్‌గా సీనియర్ ఐఏఎస్ కరుణను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇన్చార్జి వీసీలను కేయూ వీసీ నియామకం కోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వీటిని పరిశీలించి వీసీ పేర్లను సిఫార్స్ చేయడం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉండగా కేయూకు మాత్రం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పట్లో వీసీల నియామకం లేనట్లుగానే కనిపిస్తోంది. తాటికొండ రమేశ్ పదవీకాలం మంగళవా రంతో ముగియడంతో వాకాటి కరుణను ఇన్చార్జి వీసీగా నియమించింది.