హనుమకొండ, నవంబర్ 16 : 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ జేఏసీ పిలుపు మేరకు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి అదాలత్ సెంటర్లోని అమరవీరు ల స్తూపం వరకు ‘రన్ ఫర్ సోషల్ జస్టిస్’ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ విజయం సాధించగానే బీసీ రిజర్వేషన్ల సాధన పకన పెట్టి పార్టీపరంగా 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తామనడంతో కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందన్నారు. రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఉద్యమించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు అనుకూలంగా రాజ్యాంగ సవరణ చేయాల ని, లేకుంటే ఆ పార్టీకి జూబ్లీహిల్స్ ఫలితాలే పునరావృతమవుతాయని హెచ్చరించారు.
జూబ్లీహి ల్స్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ విజయం కాదని, అది ముమ్మాటికీ బీసీల విజయమే అని పేర్కొన్నా రు. బీసీల్లో చైతన్యం వచ్చిందని, ఏ పార్టీ అయితే వారిని విస్మరిస్తుందో ఆ పార్టీకి తప్పకుండా గుణపాఠం చెప్తామన్నారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండదని, బీసీ వర్సెస్ ఓసీల మధ్యే ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, బీసీ జేఏసీ నాయకులు డాక్టర్ కూరపాటి రమేశ్, బోనగాని యాదగిరి గౌడ్, షైన్ కుమార్ యాదవ్, చిర్ర రాజు గౌడ్, సంగాని మల్లేశ్వర్, తమ్మేలా శోభరాణి, మాదం పద్మజా దేవి, బచ్చు ఆనందం, నాగరాజు, భీమగాని యాదగిరి, ఐలి చంద్రమౌళి, వల్లాల జగన్, పెరుమాండ్ల అనిల్, తుపాకుల రవి, పంజాల మధు, కోలా ప్రతాప్, తెల్ల సుగుణ, కిషోర్, చాగంటి రమేశ్, హైమావతి, మౌనిక, ప్రమోద, మానస తదితరులు పాల్గొన్నారు.