మహదేవ్పూర్, జూన్ 18: మహదేవ్పూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ గౌరవ అధ్యక్షుడిగా కాలువ మల్లయ్య, గ్రామ అధ్యక్షుడిగా పేటరాజు సమ్మయ్య, ఉపాధ్యక్షుడిగా అంబాల సంజీవ్, కార్యదర్శిగా నిట్టూరి అంకయ్య, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు రమేష్, ప్రచార కార్యదర్శిగా పేట రవిలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఆత్కూరి సారయ్య, పేట దేవేందర్ మాదిగ, యువసేన మండల అధ్యక్షులు మంథని రవితేజ, చింతకుంట సదానందం, చింతకుంట రాము తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడొద్దు!.. ఇజ్రాయెల్ సైబర్ దాడుల భయాల నేపథ్యంలో అధికారులకు ఇరాన్ ఆదేశాలు!
ప్రియుడిని నిర్బంధించి.. యువతిపై గ్యాంగ్‌రేప్.. ఘాతుకానికి పాల్పడ్డ 10 మంది
TG TET | నేటి నుంచి టెట్ పరీక్షలు.. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు