నల్లబెల్లి, జూన్ 03 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ప్రధానోపాధ్యాయుడు ఉడుత రాజేందర్ అన్నారు. నల్లబెల్లి మండలంలోని కొండైల్ పల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించవలసిందిగా కోరుతూ ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, 2 జతల యూనిఫామ్స్, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, వారానికి 3 కోడిగుడ్లు, నాణ్యమైన ఉచిత విద్య, వెనుకబడిన విద్యార్థుల పట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన, అర్హత గల ఉపాధ్యాయులచే విద్య బోధన చేస్తారన్నారు.
ఈ అవకాశాన్ని వినియోగించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఈర్ల సుమలత, అంగన్వాడీ టీచర్ రజిత, ఆశ కార్యకర్త జ్యోత్స్న, పాఠశాల ఉపాధ్యాయులు పోరిక రవికుమార్, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ ఊరటి నరేష్, గ్రామస్తులు లింగారెడ్డి, ముకుంద రెడ్డి, ప్రతాప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.