సుబేదారి, జూలై 25 : నిబంధలను ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ నేత కొండా మురళికి ఎస్కార్ట్ వెళ్లిన మట్టేవాడ ఇన్స్పెక్టర్ గోపి రెడ్డి, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పై బదిలీ వేటు పడింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల ప్రొటోకాల్ లేని కొండా మురళికి ఎస్కార్ట్ వెళ్లిన వరంగల్ ఏసీపీ నంది రాం నాయక్, ఇన్స్పెక్టర్ల విధుల ఉల్లంఘన పై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘విధులు వదిలి కొండాకు ఎస్కార్ట్ వెళ్లి’కథనం పై పోలీసు కమిషనర్ విచారణ జరిపించి చార్జీ మెమోలు జారీచేసిన విషయం తెలిసిందే.
దీనిపై కొద్ది రోజుల క్రితం వరంగల్ ఏసీపీ నంది రాం నాయక్ పై బదిలీ వేటు పడింది. తాజాగా మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు పడింది. వీరిద్దరిని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.