ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురహరి భిక్షపతి డిమాండ్ చేశారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు వద్ద ఉద్యమకారుల ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి దీక్షలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని అన్నారు .ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ప్రతి ఉద్యమ కారుడికీ 250 గజాల ఇంటి అడుగు స్థలం, గుర్తింపు కార్డు, 25000 రూపాయల పెన్షన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు.
ప్రస్తుతం ఉద్యమకారులను ప్రభుత్వ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శి జంపాల రవీందర్ పాల్గొని సంఘీభావం తెలిపారు.
కార్యక్రమంలో టీయూఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముజాల భిక్షపతి, గౌరవ సలహాదారు సర్ధార్ పాషా, కోశాధికారి దర్షణాల సంజీవ, మహిళా అధ్యక్షురాలు బత్తుల రాణి, పత్తి గోపాల్ రెడ్డి, బోరాల రాజేశ్వర్ రావు, గుళ్లగట్టు సంజీవ, దగ్గు ప్రభాకర్ రావు, నర్ర భద్రయ్య, బోయిని సదయ్య, సాధం గట్టయ్య, అజ్మీరా నరేష్, గాదె శ్రీనివాస్, మెట్టు మల్లయ్య, జాజ నర్సింహులు, శెట్టి శ్రీధర్, గాజుల శ్రీనివాస్ కదారి తిరుపతి, బైకాని ఒదేలు, నూనె శ్రీనివాస్, ఈసం స్వరూప, నూనవత్ సమ్మక్క, బండి లక్ష్మి, సయ్యద్ సఫీయ, మాదరి లక్ష్మి, యాణాల ఉపేంద్ర, యాస కలమ్మ, సామ సరోజన, సామ సమ్మమ్మ, గుండు సరోజన, కాటూరి సుగుణ, ఎంకటి పద్మ, తదితరులు పాల్గొన్నారు.