మహిళా సాధికారతే లక్ష్యం
మహిళల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్లో రూ.15లక్షలతో నిర్మించిన మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, కలెక్టర్ భవేశ్మిశ్రాతో కలిసి మం త్రి ప్రారంభించారు.
- మంత్రి సత్యవతిరాథోడ్
- చెల్పూరులో మిల్లెట్స్ ప్రాసెసింగ్ ప్రారంభం
గణపురం, మే 14 : మహిళల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్లో రూ.15లక్షలతో నిర్మించిన మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, కలెక్టర్ భవేశ్మిశ్రాతో కలిసి మం త్రి ప్రారంభించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించి, తయా రు చేసిన ఆహార పదార్థాలను రుచి చూ సి, సిబ్బందిని అభినందించారు.
మంత్రి మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు రూ.2వేల విలువైన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంగన్వాడీ కేం ద్రాల ద్వారా అందించినట్లు చెప్పారు. సర్పంచ్ మధుసూదన్‌రావు, అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, డీఆర్డీవో పురుషోత్తం, మండల సమాఖ్య అధ్యక్షురాలు కౌసల్య, సీపీవో శామ్యూ ల్, తహసీల్దార్ సతీశ్‌కుమార్, ఎంపీవో హరిచంద్రారెడ్డి, ఉప సర్పంచ్ రజియా, ఎంపీటీసీలు పొనగంటి సధర్మ మలహల్రావు, చెన్నూరి రమాదేవి మధుకర్, మంద అశోక్‌రెడ్డి, మోటపోతుల శివశంకర్ గౌడ్, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మేకల రజిత పాల్గొన్నా రు.
కాగా, మైలారంలో ఏర్పాటు చేసిన రేణుకా ఎల్లమ్మ తల్లి, కంఠమ మహేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు చేసి, మాట్లాడారు. మైలారం గ్రామాభివృద్ధికి రూ.10లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి రూ.75వేలు విరాళాన్ని ఆలయ నిర్వహణ సభ్యులు అందజేశారు. ఆలయానికి విద్యుత్ ఏర్పాటుకు రూ.2లక్షలు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర చెప్పారు. ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు మారగాని శ్రీనివాస్, గౌడ సంఘం అధ్యక్షుడు పబ్బ సదయ్య, నాయకులు బైరగాని కుమారస్వామిగౌడ్, మారగాని చందుగౌడ్, మార్క గోపాల్ గౌడ్, ఎనిమండ్ల వెంకన్న గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

