తస్లీమా ఇళ్లల్లో ఏసీబీ సోదాలు
ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబుబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ తస్లీమా నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.2.94కోట్ల ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు.
- నెల క్రితం ఏసీబీకి చిక్కి సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
- ఐదు ఇళ్లు, 6 ప్లాట్లు, 3ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తింపు
- ఆస్తుల డాక్యుమెంట్లు, రూ. 1.92లక్షల నగదు స్వాధీనం
- మొత్తం రూ. 2.94కోట్ల ఆస్తులు గుర్తించామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడి
సుబేదారి, ఏప్రిల్ 22 : ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబుబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ తస్లీమా నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.2.94కోట్ల ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. సోమవారం వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో హనుమకొండలోని కాకతీయకాలనీ, యాదవనగర్లోని తస్లీమా ఇళ్లతో పాటు సూర్యాపేటలోని కుటుంబ సభ్యులు, భూపాలపల్లిలో డాక్యుమెంటరీ రైటర్స్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల తర్వాత ఆస్తుల వివరాలను ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఐదు ఇళ్ల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.27లక్షలు, ఆరు ఓపెన్ ప్లాట్ల విలువ రూ.12లక్షలు, మూడెకరాల వ్యవసాయ భూమి విలువ రూ.20.40లక్షల, వాహనాలు విలువ రూ.23.66లక్షలు, బ్యాంకు బ్యాలెన్స్ రూ.98,787, లభ్యమైన నగదు రూ.1,92,900.. మొత్తం ఆస్తుల విలువ రూ.2,94,00,547 ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఇంకా విచారణ కొనసాగుతున్నదని తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

