ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో జరిగే కార్యక్రమాల్లో అతిథులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత ప్రసంగాలు, పలుచోట్ల అభివృద్ధిపై సమీక్షించనున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్లు తెలిపారు. వరంగల్‌లో జరిగే కార్యక్రమం లో ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండలో మంత్రి కొండా సు రేఖ, ములుగులో మంత్రి సీతక్క, భూపాలపల్లిలో అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, జనగామలో విప్ బీర్ల ఐలయ్య పాల్గొననున్నారు.
వరంగల్ చౌరస్తా : ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖతో కలిసి ఉదయం 11గంటలకు ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన ఎస్డీపీ(సింగల్ డోనర్ ప్లేట్లెట్స్) కౌంటింగ్ మిషన్‌ని, కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐదో అంత స్తులో 14 యూనిట్లతో ఏర్పాటు చేసిన డ యాలసిస్ విభాగాన్ని ప్రారంభించ నున్నారు. కేఎంసీలో రూ.3.45 కోట్లతో నిర్మించే అంతర్గత రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.