ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పొద్దుపొద్దునే ఊరికి కూతవేటు దూరంలో ఆదివారం ఉదయం చైన్ స్నాచింగ్ జరిగింది.కొండపర్తికి చెందిన బాధితురాలు వరంగంటి మణెమ్మ (60)తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి బెండకాయలు కావాలంటూ తోటకు వచ్చాడని తెలిపింది. మాటలు కలిపి తన మెడలోవున్న సుమారు రెండు లక్షల విలువ కలిగిన 20 గ్రాముల బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడని తెలిపారు.
పోలీసులకు పిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రాజగోపాల్, ఎస్సై శ్రీనివాస్ బాధితురాలి నుండి వివరాలు నమోదు చేసుకొని, పంచనామ నిర్వహించి విచారణ చేపట్టారు. చైన్ స్నాచింగ్తో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిత్యం పెట్రోలింగ్ పెంచాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.