శాయంపేట/ కృష్ణకాలనీ/ పా లకుర్తి/ గార్ల/ డోర్నకల్, మార్చి 11: ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్స్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లావాసులు మెరిశారు. గ్రూప్-1లో ముగ్గురు, 2లో ఇద్దరు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా వారిని కుటుంబసభ్యులు, గ్రామస్తులు అభినందించారు. శా యంపేట మండలం మాందారిపేట గ్రామానికి చెందిన జిన్నా తేజస్వినీ రె డ్డి గ్రూప్-1లో 532.5 మారులతో రాష్ట్రంలో రెండో ర్యాంకర్‌గా నిలిచారు. మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. గార్ల మండలం పెద్ద కిష్టాపురం గ్రామానికి చెందిన గంగావత్ పవన్ కల్యాణ్ గ్రూప్-1లో 454 మార్కులు సాధించాడు. ఓపెన్ కేటగిరీ లో డిప్యూటీ కలెక్టర్ పోస్టు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన మేకల ఉపేందర్ గ్రూప్-1లో 423 మార్కులు సాధించాడు.
ఈయన మహబూబాబాద్ కలెక్టరేట్లో జూ నియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గ్రూప్ -2 ఫలితాల్లో భూపాలపల్లి మండలం ఖాసింపల్లికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్ కాళేశ్వరం జోన్లో మొదటి ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించాడు. ఆయన తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణిలో కాం ట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. బీటెక్ చదివి 2019లో పంచాయతీ సెక్రటరీ గా, 2021లో వీఆర్వోగా, గ్రూప్-4లో ఉద్యోగం సాధించి హైదరాబాద్‌లోని జీఎస్టీ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. పాలకుర్తి మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన శివకుమార్ ఎస్సైగా మహబూబాబాద్‌లో విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్-2లో 25వ ర్యాంక్ సాధించాడు.