హనుమకొండ చౌరస్తా, జులై 6: చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్‌రెడ్డి వారి సతీమణి నాయిని నీలిమరెడ్డితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంపదతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
పూజకు ముందుగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ నాయిని దంపతులను పూర్ణకుంభ, వేద మంత్రోచ్ఛారణలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్చకులు గంగు మణికంఠశర్మ, ప్రణయ్శర్మ, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.