దామెర, మే 10 : మండలంలోని ఓగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. 87 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఊరుగొండ వర్షిత, బోనాల శ్రీజ, ఎడ్ల అశ్విత్ 10/10 జీపీఏ సాధించారు. ఏడుగురు విద్యార్థులు 9.8, ఆరుగురు విద్యార్థులు 9.7 జీపీఏ, 43 మంది 9.0 జీపీఏకు పైగా సాధించారు.
విద్యార్థులను పాఠశాల ముఖ్య సలహాదారులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బీ లక్ష్మీనివాసం అభినందించారు. ఉత్తమ ఫలితాలపై కరస్పాండెంట్ దయ్యాల శోభారాణి, డైరెక్టర్లు దయ్యాల రాకేశ్భాను, దయ్యాల దినేశ్చందర్ హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను పుష్పగుచ్ఛంతో అభినందించారు.