నమస్తే నెట్వర్క్, జూన్ 2: ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. దీంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వరంగల్ నగర రోడ్లపై వరద నీరు చేరడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పీహెచ్సీ వద్ద చెట్టు విరిగి 11 కేవీ విద్యుత్ వైర్లపై పడడంతో తెగిపో యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బొమ్మనగూడెంలో చెట్టు విరిగి కరెంటు తీగలపై పడడంతో విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఎర్రగుంటపల్లి, రాపెల్లికోట తదితర గ్రామాల్లో చెట్లు విరిగి పడ్డాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో ఈదు రుగాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు టార్పాలిన్ కప్పుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, కేసముద్రంలో చెట్టు విరిగి పడ్డాయి.
ములుగు మండలంలోని మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, బండారుపల్లి, వెంకటాపూర్ మండలంలోని నర్సాపూర్, వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట గ్రా మాల్లో ని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ములుగులో రెండు గంటల పాటు మోస్తరు వర్షం పడింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. హనుమకొండ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం జలమయ మైంది. శాయంపేట మండలంలో భారీ శబ్దాలతో పిడుగుల వాన పడింది. కాజీపేట పట్టణంలోని డీజిల్ కాలనీ చౌరస్తా సమీపంలోని డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షం నీరంతా రోడ్లపై నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై విరిగిపోయిన చెట్లను స్థానికులు తొలగించారు. కాజీపేట రైల్వే జంక్షన్లో ప్లాట్ఫాం పట్టాలపైకి వర్షపు నీరు వచ్చి చే రింది. మడికొండ చౌరస్తా ప్రధాన రహదారిపై నుంచి ఖండాల దాబా వరకు 8 చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి కరెంట్ తీగలు సైతం తెగిపడ్డాయి. దీంతో సుమారు మూడు గంటల పాటు వాహనా లు ఎకడికకడే నిలిచిపోయాయి. సెంట్రల్ జోన్ డీసీపీ బారీ ఆధ్వ ర్యంలో కాజీపేట ఏసీపీ తిరుమలరావు, పోలీసులు క్లియర్ చేశారు.