హనుమకొండ, ఆగస్టు 26 : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ము మ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన ఓటరు జాబితాను గ్రామం యూనిట్‌గా వార్డుల వారీగా రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా జాబితాను సేకరించి తప్పులు లేని తుది జాబితా తయారీపై దృష్టి కేంద్రీకరించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల రూపకల్పనకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,707 జీపీలు, 15,006 వార్డులుండగా, 15,021 పోలింగ్ స్టేషన్లను అధికార యంత్రాంగ గుర్తించింది. అయితే అధికారులు తెలిపిన ప్రకారం హనుమకొండ జిల్లాలో 210 జీపీలు, 1,976 వార్డులు, 1,976 పోలింగ్ స్టేషన్లున్నాయి.
షెడ్యూల్ వివరాలు..