మల్హర్, జూన్ 10 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచెర్ల మానేరు నదిలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. పగలు, రాత్రి అనే తేడా లే కుండా అందిన కాడికి దోచుకుంన్నది. మంత్రి ఇలాకాలో ఇదంతా జరుగుతున్నా, ప్రతి రోజూ వందలాది ట్రాక్టర్లు తమ ఎదుట నుంచే వెళ్తున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మానేరు నుంచి ఇసుక అ క్రమ రవాణా వెనుక ఒక మాఫియానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పు డు ఇసుకను పక్క ఊరికి తరలించాలంటేనే భయపడే వారు.
ఇప్పుడు ఏకంగా వందల కొద్ది ట్రాక్టర్లలో దర్జాగా తరలిస్తున్నారంటే ముఠా ఎంత బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. తాడిచెర్ల నుంచి జిల్లా కేం ద్రం వరకు అటవీ ప్రాం తం, గోదావరి వాగులు, వంకలతో కళకళలాడుతున్నది. ఇక్కడి నుంచి ఇసుకను మండలంలోని కొందరు అక్రమార్కులు తోడేస్తున్నారు. తోడిన ఇసుకను ట్రాక్టర్లలో అటవీ మార్గం గుండా తాడిచర్ల, పెద్దతూండ్ల, భూపాలపల్లి మండలంలోని కాసీంపల్లి, జంగేడు, బాంబులగడ్డ గ్రామాలకు రాత్రి సమయంలో తరిలించి డంపుచేసి లారీల ద్వారా హైదరాబాద్కు తరలిస్తున్నారని, ఇందు కు ఓ అటవీశాఖ అధికారితోపాటు స్థానికంగా ఉన్న రెవె న్యూ, పోలీసు అధికారుల అండదండలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతి రోజూ ఇసుకను తమ కళ్ల ముం దే భూపాలపల్లికి తరలిస్తున్నా నేటికీ ఒక్క కేసు కూడా న మోదైన దాఖలాలు లేవు. ప్రతి నెల రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. గ్రామీణ ప్రజలు వంట చెరుకు కోసం అడవులకు వెళ్తేనే నానా రా ద్ధాంతం చేసే అటవీశాఖ సిబ్బంది అదే అడవుల వెంట వం దల ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో జిల్లా అటవీశాఖ కార్యాలయంలోని ముఖ్య అధికారికి అసిస్టెంట్ గా పని చేస్తున్న ఓ ఆఫీసర్ చక్రం తిప్పుతున్నట్లు స్థానికంగా ప్ర చారం జరుగుతున్నది. ఒక ట్రాక్టర్కు నెలకు రూ.15 వే లు వసూలు చేస్తున్నట్లు జిల్లా కేం ద్రంలోని ట్రాక్టర్ల అడ్డా వద్ద బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడుస్తుందంటే ఒక్కరి వల్ల అయ్యే పని కాదని, తెర వెనుక ఎవరెవరున్నారనేది ఉన్నతాధికారుల విచారణలోనే బయటపడే అవకాశముందంటున్నారు. కాగా, మంత్రి ప్రాతినిథ్య నియోజకవర్గంలో ఇంత దర్జాగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడంతోనే అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? లేక ఒక ఒప్పందానికి వచ్చి ఇసుక అక్రమ రవాణాకు శ్రీకారం చుట్టారా? అనేది తేలాల్సి ఉన్నది.