కాజీపేట, ఫిబ్రవరి 5 : కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను ఈ నెల 6 నుంచి 11 వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-మౌలాలి-చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైన్ పనుల కారణంగా హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే (17011/17012) ఇంటర్ సిటీ, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే (12757/12758) సిర్పూర్ కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ రైలు, సికింద్రాబాద్-గుంటూర్-సికింద్రాబాద్ మధ్య నడిచే (12706/12705) ఇంటర్ సిటీ, విజయవాడ-సికింద్రాబాద్- విజయవాడ మధ్య నడిచే (12713/12714) శాతవాహన, సికింద్రాబాద్-భద్రాచలం రోడ్డు-సికింద్రాబాద్ మధ్య నడిచే(17659/17660) మణుగూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
అలాగే సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే (17233/17294) భాగ్యనగర్, సికింద్రాబాద్-గుంటూర్-సికింద్రాబాద్ మధ్య నడిచే (17201/17202) గోలొండ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాజీపేట వరకు కుదించినట్లు చెప్పారు.