తొర్రూరు, ఫిబ్రవరి 2 : బీఆర్ఎస్ పార్టీతోనే తొర్రూరు పట్టణం అభివృద్ధి పథంలో నడిచిందని మా జీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం 1వ, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులు భూసాని జయమ్మ-ఉప్పలయ్య, సర్వీ వెంకన్నను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశానని, కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించి కూరగాయల వ్యాపారులకు లాభం చేకూర్చానని, సెంట్రల్ లైటింగ్‌ను మంజూరు చేశానని, ఇప్పటివరకు దానిని ప్రారంభించలేదని మండిపడ్డారు. అలాగే అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిందని, 100 పడకల ఆసుపత్రికి స్థలం కేటాయిస్తే కావాలనే అడ్డుకున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాం లో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే, కాంగ్రెస్ ఎమ్మెల్యే తానే కట్టించినట్లు ప్రారంభిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలకు మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. మహిళల పేరు మీద రూ. 1200 అప్పు చేసి ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు.
పేదల కోసం 280 డబుల్ బెడ్రూమ్లను నిర్మిస్తే వాటిని కాంగ్రెస్ ప్రభు త్వం పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుందని, ఇండ్ల కోసం పోరాటం చేసిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరులోని మొత్తం16 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొర్రూరు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పట్టుదలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, శ్రీరాం సుధీర్, ధరావత్ గాంధీనాయక్, ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు.
అభివృద్ధి సాక్షిగా..
తొర్రూరును మున్సిపాలిటీగా అభివృద్ధి చేసింది తానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనుల వద్ద మున్సిపల్ అభ్యర్థులకు ఎన్నికల ఇన్చార్జి మర్రి యాదవ్ రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన బీఫామ్స్ అందజేశారు. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, దోబీఘాట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సెంట్రల్ లైటింగ్, మినీ ట్యాక్ బండ్ల వద్ద అభ్యర్థులకు బీఫామ్స్ అందించారు. 1వ వార్డుకు భూసాని జయమ్మ-ఉప్పలయ్య, 2వ వార్డు సర్వీ వెంకన్న, 3వ వార్డు తూర్పాటి రవి, 4వ వార్డు-పేర్ల జంపన్న, 5వ వార్డు మచ్చ సురేశ్, 6వ వార్డు రాయిశెట్టి మానస-యాకేందర్, 7వ వార్డు మాడుగుల భవానీలత-నట్వర్, 8వ వార్డు అల్లం శ్యామల-శ్యామ్, 9వ వార్డు కిన్నెర కవిత-సతీశ్, 10వ వార్డు రుద్రోజు విజయభాస్కర్, 11వ వార్డు కర్నె నాగరాజు, 12వ వార్డు ధరావత్ పద్మ-కిషన్ నాయక్, 13వ వార్డు ఎన్నమనేని శ్రీదేవి-శ్రీనివాస్‌రావు, 14వ వార్డు మడిపెద్ద స్రవంతి-మల్లేశ్, 15వ వార్డు చాకిలేల అలివేణి-నాగరాజు, 16వ వార్డు ధరావత్ జైసింగ్‌నాయక్ బీఫామ్స్ అందుకున్నారు.