చెన్నారావుపేట : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెల్లువలా మద్దతు లభిస్తున్నది. పల్లె నుంచి పట్నం వరకు అన్ని వర్గాల ప్రజలు చలో వరంగల్ సభ అంటూ ఊరూరా మద్దతు తెలుపుతున్నారు. తాజాగా మరో రెండు రోజుల్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్న నూతన జంట తాము సైతం బీఆర్ఎస్ సభకు వస్తామని తెలిపారు. ఇంటి పార్టీ బీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం చెన్నారావుపేట మండలంలోని జోజిపేట నారాయణ తండా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మరో రెండు రోజుల్లో( ఏఫ్రిల్24) వివాహం జరగనున్న నూతన వధూవరులు హరీష్, అంకిత బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు మేము సైతం వస్తామని స్థానిక నేతలకు తెలిపారు.
నూతన వధూవరులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రజతోత్సవ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అడుగడుగునా ఆంధ్ర పాలకుల చేతిలో వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్నామన్నారు. పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల బాధ్యులు బాల్య వెంకన్న, మాజీ ఎంపీపీ జక్కా అశోక్ర మాజీ సర్పంచ్ విజయ బాలాజీర అనుమల కుమార్ స్వామిర బోడ మురళి నాయక్, తదితరులు పాల్గొన్నారు.