వరంగల్ : నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల హాస్పిటల్లో డాక్టర్లు అందిస్తున్న వైద్య సేవలు, వైరాలజీ ల్యాబ్, దవాఖాన రికార్డులను పరిశీలించారు.
అనంతరం దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు.
హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకొని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.